అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఇలాంటి యాడ్స్ కోసం ‘ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని’ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రెండు నెలల్లోగా ఈ మేరకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. నిషేధించిన ప్రకటనలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించాలని ధర్మాసనం పేర్కొంది.
తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వవద్దని ఆ సంస్థను మందలించింది. ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల కట్టడి చర్యలు చేపట్టాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.