అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టం రాజ్యాంగ(constitutional) చెల్లుబాటుపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. వక్ఫ్ చట్టం(Wakf Act) అమలుపై స్టేకు నిరాకరించిన ధర్మాసనం.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
పార్లమెంట్(Parliament) కు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా? అని సుప్రీం వ్యాఖ్యానించింది. హిందూ ట్రస్టులలోకి ముస్లింలను అనుమతిస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని(Wakf Amendment Act) రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తో పాటు ముస్లిం సంఘాలు ఆయా పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్(Chief Justice Sanjiv Khanna, Justice Sanjay Kumar and Justice KV Vishwanathan) లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
Supreme Court : అలా ఎలా డీనోటిఫై చేస్తారు?
సుదీర్ఘ కాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్)(Wakf by User) ఆస్తులను డీనోటిఫై చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘వక్ఫ్ బై యూజర్’ను ఎలా నిరాకరించవచ్చో ధర్మాసనం ప్రశ్నించింది. ఎందుకంటే చాలా మందికి అలాంటి వక్ఫ్ లను నమోదు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఉండవని తెలిపింది. వారి వద్ద ఏ పత్రాలు ఉండనప్పుడు మరీ మీరు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది.
‘సుదీర్ఘ కాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక ఇబ్బందులు వస్తాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం. అయితే, ఇది పలుమార్లు దుర్వినియోగమైందన్నది వాస్తవమే. మరోవైపు, నిజంగానే ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయని’ చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ప్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Supreme Court : చరిత్రను మార్చలేరు..
వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని పిటిషనర్ల తరఫున వాదించిన కపిల్ సిబల్ అన్నారు. ముస్లింలు మాత్రమే వక్ఫ్ ను సృష్టించగలరని చెప్పే నిబంధన సరికాదన్నారు.. “నేను ముస్లింనా కాదా అని రాష్ట్రం ఎలా నిర్ణయించగలదు. అందువల్ల వక్ఫ్ ను సృష్టించడానికి అర్హత ఉంది. గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్న వారు మాత్రమే వక్ఫ్ ను సృష్టించగలరని ప్రభుత్వం ఎలా చెప్పగలదని” అని సిబల్ ప్రశ్నించారు.
అయితే, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. చట్టం ఆమోదించడానికి ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీ 33 సమావేశాలు నిర్వహించి, 98 లక్షల విజ్ఞప్తులను పరిశీలించిందన్నారు. వక్ఫ్ చట్టం ద్వారా పాలించబడటానికి ఇష్టపడని ముస్లింలలో పెద్ద వర్గం ఉందని మెహతా సమర్పించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. “ఇక నుంచి ముస్లింలను హిందూ ఎండోమెంట్ బోర్డుల(Hindu Endowment Boards)లో భాగం కావడానికి మీరు అనుమతిస్తారని చెబుతున్నారా? అదే నిజమైతే. బహిరంగంగా చెప్పండని.” సూచించింది. 100 లేదా 200 సంవత్సరాల క్రితం ఒక పబ్లిక్ ట్రస్ట్(public trust) ను వక్ఫ్ గా ప్రకటించినప్పుడు, దానిని అకస్మాత్తుగా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోలేదని తాము ప్రకటించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. “మీరు గతాన్ని తిరిగి రాయలేరు కదా” అని ధర్మాసనం పేర్కొంది.
“రెండు వైపులా మేము ప్రస్తావించాలనుకుంటున్న రెండు అంశాలు ఉన్నాయి. మొదట, మేము దానిని స్వీకరించాలా? లేదా హైకోర్టుకు బదిలీ చేయాలా? రెండోది.. మీరు నిజంగా ఏమి కోరుతున్నారో, వాదించాలనుకుంటున్నారో క్లుప్తంగా చెప్పండి’ అని మెహతాకు సూచించింది.
అదే సమయంలో చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లను విచారించడంలో, నిర్ణయించడంలో సుప్రీంకోర్టుకు ఎటువంటి అడ్డంకులు ఉన్నాయని మేము చెప్పడం లేదని చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా తెలిపారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వాలని పేర్కొంటూ తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.