West Bengal | 25 వేల టీచర్​ పోస్టుల రద్దు.. సుప్రీం సంచలన తీర్పు

West Bengal | 25 వేల టీచర్​ పోస్టుల రద్దు.. సుప్రీం సంచలన తీర్పు
West Bengal | 25 వేల టీచర్​ పోస్టుల రద్దు.. సుప్రీం సంచలన తీర్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్: West Bengal | సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు చెప్పింది. 25 వేల టీచర్​ పోస్టు(Teacher Posts)లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో 2016లో 25 వేల టీచింగ్​, నాన్​టీచింగ్​ పోస్టులను భర్తీ చేశారు. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని పలువురు కోల్​కతా హైకోర్టు (Kolkata Highcourt)ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 2024 ఈ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది.

Advertisement
Advertisement

అయితే అప్పట్లో హైకోర్టు తీర్పుపై స్టే(Stay) ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు(High Court judgment)ను సమర్థిస్తూ 25 వేల పోస్టులను రద్దు చేసింది. మూడు నెలల్లో కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.

West Bengal | అసలు వివాదం ఏమిటంటే..

పశ్చిమ బెంగాల్​లో మమత బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వం 2016లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 వేలకు పైగా ఉపాధ్యాయులను నియమించింది. ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని పలువురు హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. దీంతో కోల్‌కతా హైకోర్టు ఆ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. ఆ సమయంలో కొలువులు పొందిన ఉపాధ్యాయులు తాము తీసుకున్న జీతాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  High Court | హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊరట

అయితే దానిపై బెంగాల్​ ప్రభుత్వం సుప్రీం(Supreme)ను ఆశ్రయించింది. ఆ సమయంలో స్టే(Stay) ఇచ్చిన ధర్మాసనం ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నియామకాల్లో అవకతవకలు జరిగితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. తాజాగా సుప్రీం కోర్టు(Supreme Court) ఆ నియామకాలు చెల్లవని స్పష్టం చేస్తూ తుది తీర్పు వెలువరించింది.

Advertisement