Waqf act | వక్ఫ్​ సవరణ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు

Waqf act | వక్ఫ్​ సవరణ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు
Waqf act | వక్ఫ్​ సవరణ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Waqf act | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్​ సవరణ చట్టాన్ని Waqf Amendment Act తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముస్లిం సంఘాలు, పలు ప్రతిపక్ష పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో వక్ఫ్​ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు supreme courtలో మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై గురువారం జస్టిస్ సంజీవ్ కన్నా justice sanjeev khanna నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

Advertisement

చట్టంపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం గడువు కోరింది. దీంతో కేంద్రానికి వారం రోజుల సమయం ఇచ్చిన సుప్రీం కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ బోర్డులో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టవద్దని ఆదేశించింది. వక్ఫ్ ఆస్తుల విషయంలో కూడా ఎలాంటి మార్పులు చేయొద్దని సూచించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Central Government : పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్రం.. ముందు మీ రికార్డు చూసుకోవాలని హితవు

మరోవైపు వక్ఫ్ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు చర్చకు దారితీసింది. తదుపరి సుప్రీం ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement