అక్షరటుడే, కామారెడ్డి: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ న్యాక్ గుర్తింపునకు కావాల్సిన సౌకర్యాలు సిద్ధం చేయాలని తెయూ వీసీ యాదగిరి రావు సూచించారు. బుధవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద గల సౌత్ క్యాంపస్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. విద్యార్థుల ప్రయోజనం కోసం అధ్యాపకులు, అధికారులు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలోనే న్యాక్ గుర్తింపు సమయం అయిపోయిందని, వెంటనే న్యాక్ గుర్తింపునకు కావాల్సిన సౌకర్యాలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.