Mumbai Indians | ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీపై స‌స్పెన్స్.. సూరీడుని కెప్టెన్‌గా ఎంపిక చేస్తారా..!

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీపై స‌స్పెన్స్.. సూరీడుని కెప్టెన్‌గా ఎంపిక చేస్తారా..!
Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీపై స‌స్పెన్స్.. సూరీడుని కెప్టెన్‌గా ఎంపిక చేస్తారా..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Mumbai Indians | మ‌రి కొద్ది రోజుల్లో ఐపీఎల్ (IPL) స‌మ‌రం మొద‌లు కానుంది. ఈ సారి ఏ జ‌ట్టు విజృంభిస్తుంది, ఎవ‌రు ట్రోఫీ అందుకుంటారు అనేది చెప్ప‌డం క‌ష్ట‌మే. అన్ని టీమ్స్ చాలా ట‌ఫ్‌గా క‌నిపిస్తున్నాయి. గ‌త కొన్ని సీజ‌న్స్‌లో (Mumbai Indians) ముంబై ఇండియ‌న్స్ పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డం లేదు. దీంతో ఈ సారి క‌ప్ ఎలా అయిన కొట్టాల‌నే క‌సితో ఉన్నారు. అయితే ఈ సీజ‌న్‌లో పెద్ద షాక్ త‌గిలింది. (Mumbai Indians) ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌కు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) దూరం కానున్నాడు. ఇందుకు కారణం, అతనిపై ఓ మ్యాచ్‌ నిషేధం ఉండడమే. ఈ నిషేధం గత సీజన్‌లోది కావడం గమనార్హం. గతేడాది (IPL) ఐపీఎల్‌లో (Mumbai Indians) ముంబై ఇండియన్స్‌ జట్టు మూడుసార్లు స్లో ఓవర్‌ రేట్‌ కార‌ణంగా జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ రూ. 30 లక్షల జరిమానా ఎదుర్కోవడంతో పాటు ఓ మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు.

Advertisement

Mumbai Indians | అత‌నికే ఛాన్స్..

అయితే ముంబై జ‌ట్టు దారుణ వైఫ‌ల్యం వ‌ల‌న గ్రూప్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించింది. జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి దూరం కావ‌డంతో పాండ్యాపై మ్యాచ్ నిషేధం విధించ‌డం సాధ్యం కాలేదు. అందుకే ఈనెల 23న చెన్నైలో సీఎస్‌కే జట్టుతో ముంబై ఇండియన్స్‌ ఆడే తమ తొలి మ్యాచ్‌కు హార్దిక్‌ (Hardik Pandya) దూరమ‌వుతారు. హార్ధిక్ గైర్హాజరులో తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వెన్ను గాయం కారణంగా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హార్దిక్ గైర్హాజరీలో ముంబైని ఎవరు నడిపిస్తారనే చర్చ న‌డుస్తుండగా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టు సారథ్య బాధ్యతలు చేపడుతాడ‌ని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CSK vs MI : ధోని- రోహిత్ మ్యాచ్ కోసం అన్ని ల‌క్షలు ఖ‌ర్చు చేయాలి.. అయోమ‌యంలో అభిమానులు

లేదు టీ20 మ్యాచ్‌లకి అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్న Suryakumar Yadav సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా Suryakumar Yadav సూర్య కుమార్‌ యాదవ్‌కు మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో టీమిండియా 18 మ్యాచుల్లో.. నాలుగు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. ఈ క్రమంలో Suryakumar Yadav సూర్య కుమార్‌ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కూడా లేక‌పోలేదు. చూడాలి మ‌రి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.