అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SVSC | వెంకటేశ్, మహేశ్‌బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013లో విడుదలై భారీ హిట్ కొట్టింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కూడా భారీగా వసూళ్లు రాబట్టింది. హీరోయిన్లు అంజలి, సమంత తమ నటనతో మెప్పించారు. తాజాగా ఈ సినిమా శుక్రవారం రీ రిలీజ్ అయింది.
SVSC | ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు భారీ స్పందన వస్తోంది. అటు మహేశ్ బాబు ఫ్యాన్స్, ఇటు వెంకటేశ్ ఫ్యాన్స్ సినిమా రీ రిలీజ్‌తో ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటులు నటించిన సినిమాను మరోసారి థియేటర్లలో చూస్తూ హంగామా చేస్తున్నారు. విజయవాడలోని ఓ థియేటర్లో అయితే వెంకటేశ్, అంజలి పెళ్లయిన తర్వాత ఇంట్లోకి వచ్చే సీన్ రీ క్రియేట్ చేసి మురిసిపోయారు. థియేటర్లలో ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.