అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: పట్టణంలోని 17వ వార్డు పరిధిలో గల ప్రగతినగర్‌లో ఆదివారం స్వచ్ఛదనం–పచ్చదనం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి హాజరై కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతిఒక్కరు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని కోరారు. అనంతరం కాలనీలో కుక్కల బెడద తీర్చాలని స్థానికులు ఆమెను కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ జూలూరి సుధాకర్, పట్టణ కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, వనిత, తదితరులున్నారు.