అక్షరటుడే, ఇందూరు:Taekwondo | తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని బీఎల్ఎన్ గార్డెన్(BLN Garden)లో క్రీడాకారులకు కలర్ బెల్ట్ల ప్రమోషన్ నిర్వహించారు. సుమారు 150 మంది క్రీడాకారులు ప్రమోషన్ టెస్ట్(promotion test)లో పాల్గొని, ఆయా బెల్ట్లను కైవసం చేసుకున్నారు.
వీరికి జిల్లా జడ్జి సునీత కుంచాల, అసోసియేషన్ ఛైర్మన్ బస్వా లక్ష్మీనర్సయ్య క్రీడాకారులకు బెల్ట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర గుప్తా, డాక్టర్ శ్రీనివాస్, బ్లాక్ బెల్టర్ నేహ, గంగాధర్, నాగరాజ్, సిద్ధార్థ, రిత్విక, గోపికృష్ణ పాల్గొన్నారు.