అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tahavor Rana | అమెరికా జైలులో ఉన్న ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన Mumbai blasts accused తహవూర్ రాణాను Tahavor Rana ఆ దేశం భారత్‌కు అప్పగించింది. మన దేశం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం అతడ్ని అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక విమానంలో రాణాను ఇండియాకు తీసుకురానుంది.
తనను భారత్‌కు అప్పగించవద్దంటూ తహవూర్ రాణా అమెరికాలో న్యాయ పోరాటం చేశారు. భారత్‌కు అప్పగిస్తే తనను అక్కడ చిత్రహింసలకు గురి చేస్తారని ఆరోపించాడు. అయితే, ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు Supreme Court తిరస్కరించడంతో అతడికి చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు America వెళ్లిన భారత అధికారుల బృందం అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది. దీంతో అమెరికా America రాణాను భారత్‌కు అప్పగించింది.
Tahavor Rana | ముంబైకా.. ఢిల్లీ జైలుకా?
తహవూర్ రాణాను Tahavor Rana ఇండియాకు తీసుకొచ్చాక ఎక్కడికి తరలిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఢిల్లీలోని తీహార్ జైలుకు Tihar Jail తరలిస్తారా? లేక ముంబైలోని Mumbai సర్ ఆర్థిర్ రోడ్ జైలుకు పంపిస్తారా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైసెక్యూరిటీ సెల్‌లను high-security cells సిద్ధం చేయాలని ఆయా జైళ్ల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఉగ్రవాద దాడి కేసును ముంబై నుంచి ఢిల్లీకి Mumbai to Delhi బదిలీ చేయాలని కోరుతూ.. జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన అభ్యర్థనను కోర్టు ఇటీవల ఆమోదించింది. దీంతో అతడ్ని ఢిల్లీ జైలుకు పంపించే అవకాశముందని చెబుతున్నారు.
ఇటీవల అమెరికాలో ప్రధాని మోదీ Prime Minister Modi పర్యటించిన సమయంలో ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ US President Donald Trump ప్రకటించారు. ప్రపంచలోని అత్యంత దుష్ట వ్యక్తులలో అతడు ఒకరని, అతడు భారత్‌లో న్యాయ విచారణను ఎదుర్కొంటాడని చెప్పారు. ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే రాణాను భారత్‌కు అప్పగించగం విశేషం.
రాణా 1961లో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని Punjab province, Pakistan చిచావత్నిలో జన్మించారు. వృత్తిరీత్యా వైద్యుడైన రాణా పాకిస్తాన్ ఆర్మీ Pakistan Army మెడికల్ కార్ప్స్‌లో కెప్టెన్, జనరల్ డ్యూటీ ప్రాక్టీషనర్‌గా General Duty Practitioner పనిచేశారు. 1997లో కెనడాకు వలస వచ్చిన రాణా ముంబై పేలుళ్లలో కీలక పాత్ర పోషించాడు. ముంబై దాడుల్లో 174 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన కేసులో నిందితుడైన రాణా భారత్‌లో న్యాయ విచారణ ఎదుర్కోనున్నాడు.