ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా తాహెర్‌ బాధ్యతల స్వీకరణ

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత తాహెర్‌బిన్‌ హందాన్‌ మంగళవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి జిల్లాకు చెందిన నేతలు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాహెర్‌ను సన్మానించారు. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అజ్మతుల్లా, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌ ఉబేదుల్లా పాల్గొన్నారు.