Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: పాఠశాలలో మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయాలని తహశీల్దార్​ మహేందర్​, ఎంఈవో వెంకటేశం సూచించారు. ఎల్లారెడ్డిలో శుక్రవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలల్లో మెనూ అమలు చేయాలన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని సూచించారు. తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలని ఆదేశించారు. విద్యార్థులు అస్వస్థతకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఫుడ్ సేఫ్టీ కమిటీదేనిని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | ఉపాధి హామీ పనుల పరిశీలన