అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రానికి చెందిన గుండా బాలకిషన్, స్వామికి చెందిన ఇల్లు మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైనట్లు తహశీల్దార్ నరేందర్ తెలిపారు. ఆయన తెలిపిన విరాల ప్రకారం.. బాలకిషన్, స్వామి ఇద్దరు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు.