అక్షరటుడే, ఆర్మూర్: మండల కేంద్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆన్ లైన్ నమోదు ప్రక్రియ కేంద్రాన్ని తహశీల్దార్ రమేశ్ శనివారం పరిశీలించారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా డాటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు. ఆలూరు మండల కేంద్రంలో 86శాతం డాటా ఎంట్రీ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో మొత్తం పూర్తవుతుందని తెలిపారు. ఆయన వెంట కార్యదర్శులు రాజలింగం, నాజిర్, నవీన్, శ్రీనివాస్, సంతోష్ వివిధ గ్రామాల కార్యదర్శులున్నారు.