child care | చిన్న చిట్కాలతో చిన్నారుల సంరక్షణ

child care | చిన్న చిట్కాలతో చిన్నారుల సంరక్షణ
child care | చిన్న చిట్కాలతో చిన్నారుల సంరక్షణ

అక్షరటుడే, వెబ్​డెస్క్: child care | అకస్మాత్తుగా వచ్చే వాతావరణ మార్పులను(Climate Change) చిన్నపిల్లలు తట్టుకోలేరు. పూల వలే సున్నితంగా ఉండే పిల్లల చర్మం(Children’s skin)పై వాతావరణ మార్పులతో తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తగిన రక్షణ చర్యలు చేపట్టకపోతే చర్మం పొడిగా మారడం(Dry skin), దద్దుర్లు రావడం(Rash), ఇన్ఫెక్షన్లు(Infections) సోకడం వంటి ప్రమాదాలు ఉంటాయి. ప్రస్తుతం వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.

Advertisement

ఎండలు దంచి కొడుతున్నప్పటికీ.. ఒక్కసారిగా వాతావరణం(Weather) చల్లబడుతుండడంతో పాటు చిరుజల్లులు కురుస్తున్నాయి. అనూహ్యంగా చోటు చేసుకుంటున్న ఇలాంటి మార్పుల సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.

  • సీజనల్ పరంగా వచ్చే మార్పులను బట్టి పిల్లలకు సరైన దుస్తులు ఎంచుకోవాలి. ప్రస్తుత వేసవిలో కాటన్(Cotton), తేలికపాటి దుస్తులను వేయాలి.
  • పిల్లల చర్మాన్ని తరచూ కొబ్బరినూనెతో మసాజ్(Coconut Oil Massage) చేయాలి. కొబ్బరి నూనె(Coconut Oil)లో సహజ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల చర్మానికి రక్షణ కల్పించడంతో పాటు సహజ తేమను పట్టి ఉంచేలా చేస్తాయి. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్(Antibacterial), యాంటీ ఫంగల్(Anti fungal) లక్షణాలు ఉంటాయి. ఇవి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో దురద, చర్యవ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకకుండా పిల్లల చర్మాన్ని రక్షిస్తాయి.
  • అధిక మోతాదు కలిగిన రసాయనాలతో తయారు చేసిన సబ్బులను ఉపయోగించడం వల్ల పిల్లల చర్మం పొడిగా మారుతుంది. వాతావరణం(Weather) మారినప్పుడు ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో చిన్నారులకు స్నానం చేయించండి. పిల్లల చర్మానికి ఒకసారి మాత్రమే సబ్బును రాయండి. పదే పదే సబ్బు రుద్దడం(Soap rubbing) వల్ల వారి చర్మంపై నుంచి తేమ తొలగిపోతుంది. స్నానం తర్వాత, హైడ్రేట్(Hydrate)గా ఉంచడానికి బేబీ లోషన్(Baby Lotion) లేదా అలోవెరా జెల్(Aloevera gel) రాయాలి.
  • చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎండలోకి తీసుకెళ్లేటప్పుడు సన్స్క్రీన్(Sunscreen) వాడరు. ఇలా చేయడం పూర్తిగా తప్పు. సూర్యుడి నుంచి రక్షించడానికి పిల్లల చర్మంపై సన్స్క్రీన్ రాయడం చాలా అవసరం.
  • మారుతున్న వాతావరణంలో, గాలిలోని దుమ్ము ధూళి(Dust) నుంచి పిల్లల చర్మాన్ని రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మురికి లేదా దుమ్ము(Dust) ఉన్న ప్రదేశాలలో పిల్లలు ఆడుకోకుండా చూడాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయించండి.
Advertisement