అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తమిళ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్ల వద్ద యూట్యూబ్‌ ఛానళ్ల ఇంటర్వ్యూలను నిషేధించాలని యజమానులను అభ్యర్థించింది. ఈ మేరకు లేఖను విడుదల చేసింది. సినిమాలోని స్థూల లోపాలను విమర్శించే హక్కు ఉందని.. కానీ సినిమా విమర్శల పేరుతో పూర్తిగా విమర్శించడం సరికాదన్నారు. ఇది చిత్ర పరిశ్రమను దెబ్బతీసే అవకాశం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఇండియన్‌-2, వేట్టయన్‌, కంగువ చిత్రాలపై ప్రతికూల సమీక్షలు రావడంతో చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది.