అక్షరటుడే, వెబ్డెస్క్ : Ghibli Style | సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి నిత్యం కొత్త దారులు వెతుకుతారు. కాలానుగుణంగా ట్రెండింగ్లో ఉన్న అంశాలను ప్రజలను మోసం చేయడానికి వాడుతుంటారు. ఇలాగే గతంలో రేషన్ కార్డులు(Ration Cards), రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఇళ్ల పేరిట తెలంగాణలో మోసాలకు పాల్పడ్డారు. ఏపీకే(APK) ఫైళ్లు పంపి ఫోన్లను హ్యాక్ చేసి ఖాతాలను ఖాళీ చేశారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన గిబ్లి స్టైల్(Ghibli Style) ఫొటోల ట్రెండ్ నడుస్తోంది. ఏఐ(AI) ద్వారా గిబ్లి స్టైల్లో తమ ఫొటోలు క్రియేట్ చేసుకొని నెటిజెన్లు మురిసిపోతున్నారు. దీనిని కూడా సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. లింక్‌లు, ఏపీకే ఫైళ్లు పంపి ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం(Tamilanadu Govt) అప్రమత్తమైంది. అపరిచిత లింక్‌లు ఓపెన్ చేయొద్దని, యాప్లు డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచించింది. ఇలా చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.