అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జారీ చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని తపస్‌ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. సోమవారం తపస్‌ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పేద పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు భావిస్తున్నామన్నారు. సంఖ్యతో సంబంధం లేకుండా 50లోపు విద్యార్థులున్న పాఠశాలలకు ముగ్గురు, 50 నుంచి 100 వరకు ఉన్న పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. అలాగే ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టును మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.