అక్షర టుడే ఇందూరు: విద్యాశాఖలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, బద్రీనాథ్ తెలిపారు. సోమవారం జిల్లా కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..22న అన్ని పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, 28న మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్ర సమర్పణ ఉంటుందన్నారు. వచ్చేనెల 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, 23న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్మాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు.