అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tariffs suspend : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. చైనాను మినహాయించి మిగతా 70 దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా(temporarily) నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో చైనాపై టారీఫ్‌ను భారీగా పెంచుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సుంకాలను 125 శాతానికి పెంచనున్నట్లు వెల్లడించారు.
అమెరికా వస్తువుల(American goods)పై చైనా(CHINA) ఇప్పటికే 84 శాతం టారీఫ్ విధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రపంచ మార్కెట్లను చైనా అవమానంగా చూసిందని, అంతర్జాతీయ వ్యాపార నిబంధనలను గౌరవించకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు.