అక్షరటుడే, కామారెడ్డి: దేవునిపల్లి మండలం లింగాపూర్‌లోని ఓ ఫాంహౌస్‌లో పేకాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం దాడి జరిపారు. పేకాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతయ్య తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,12,800 నగదు, రెండు కార్లు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.