TCS | టీసీఎస్​ కీలక ప్రకటన.. భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం

TCS | టీసీఎస్​ కీలక ప్రకటన.. భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం
TCS | టీసీఎస్​ కీలక ప్రకటన.. భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TCS | భారత ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(TCS)​ కీలక ప్రకటన చేసింది. ఇంజినీరింగ్ పట్టభద్రులు, సాఫ్ట్​వేర్​ కోర్సులు నేర్చుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి శుభవార్త చెప్పింది.

Advertisement
Advertisement

ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు tcs jobs భర్తీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్​ 1.10 లక్షల మంది నిపుణులకు ప్రమోషన్లు tcs promotions కల్పించింది. ఈ ఏడాది కొత్తగా 42 వేల మంది ఫ్రెషర్స్‌ freshersను నియమించుకోవాలని టీసీఎస్ యోచిస్తోంది.

TCS | అనిశ్చితిలోనూ..

ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర IT Sector సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ Trump​ టారిఫ్​ల భయం, స్వదేశీ నినాదంతో ఎక్కువగా ఐటీ కంపెనీలపైనే ప్రభావం పడనుంది. దీంతో ఇప్పటికే ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయితే సంక్షోభంలోనూ కొత్తగా 42 వేల ప్రెషర్లను నియమించుకోవాలని టీసీఎస్​ భావిస్తోంది. ప్రారంభ స్థాయి ఉద్యోగుల కోసం టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.

TCS | జీతాల పెంపు లేనట్లే..

ప్రస్తుతం అమెరికా America టారిఫ్​ Tariffs ల భయంతో టీసీఎస్​ ఉద్యోగుల వేతన పెంపుపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ ఏడాది వేతన వాయిదా పడినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం సంస్థలో 6,07,979 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వేతన పెంపు వాయిదా పడినప్పటికీ, కంపెనీ వేరియబుల్ పే చెల్లింపులను కొనసాగిస్తోంది.

TCS | తగ్గిన లాభం

టీసీఎస్​ ఇటీవల తన క్యూ –4 q4 results tcs ఫలితాలను ప్రకటించింది. ఇందులో లాభం స్వల్పంగా తగ్గి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం మాత్రం 3.5 శాతం వృద్ధితో రూ. 61,237 కోట్లకు పెరిగింది.

Advertisement