
అక్షరటుడే, వెబ్‌డెస్క్ CM Chandrababu : ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీని వల్ల త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దానిపై కొంత సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ టీడీపీ కూటమి ముందుకెళ్లాలంటే ఎవరో ఒకరు, ఏదో పార్టీ నుంచి ఎవరో ఒక నేత ఖచ్చితంగా తమ టికెట్లను త్యాగం చేయాల్సి అవసరం వచ్చింది. ప్రస్తుతం ఏపీలో జరిగిన విషయం కూడా అదే. అయితే.. ఎవరైతే టికెట్లు త్యాగం చేస్తారో వాళ్లకు భవిష్యత్తులో పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు కూడా పలుసార్లు స్పష్టం చేశారు.
ఈనెల 20 వ తేదీన ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. వాళ్లకే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమికే మెజారిటీ ఎక్కువగా ఉండటం వల్ల 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా టీడీపీ కూటమి అభ్యర్థులకే దక్కనున్నాయి.
ఇందులో జనసేన పార్టీ నుంచి జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు టీడీపీ నుంచే టికెట్లు లభిస్తాయని అంతా అనుకున్నాయి. కానీ.. బీజేపీ కూడా తమకు ఒక టికెట్ ఇవ్వాలని కోరడంతో బీజేపీకి ఒక సీటు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో టీడీపీకి మూడు సీట్లు మిగిలాయి. ఈ మూడు సీట్ల కోసం టీడీపీలో పదుల సంఖ్యలో నేతలు వేచి చూశారు. తమకంటే తమకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేసినా చివరకు బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ ప్రసాద్.. ఈ ముగ్గురికే టికెట్లు దక్కాయి.
CM Chandrababu : ఈ ముగ్గురి ఎంపిక వెనుక ఉన్న బలమైన కారణాలు ఇవేనా?
ఈ ముగ్గురినే చంద్రబాబు ఎంపిక చేయడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీద రవిచంద్రది యాదవ సామాజిక వర్గం. ఇక.. కావలి గ్రీష్మ ప్రసాద్.. ఎవరో కాదు టీడీపీ సీనియర్ లీడర్, స్పీకర్ ప్రతిభా భారతి కూతురు. బీటీ నాయుడు రాయలసీమకు చెందిన నేత, చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నారు. ఇలా.. పలు సమీకరణలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ ముగ్గురికి టికెట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.