పెళ్లి కూతురికి పుస్తె మట్టెలు అందజేత

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన పెళ్లి కుమార్తె బాలమనికి ఆదివారం ఎండ్రియల్ గ్రామానికి చెందిన సుజిత కృష్ణాకర్ ఉపాధ్యాయ దంపతులు పుస్తె మట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపడుచు పెళ్లికి సహాయం అందించడం దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కనుకల్ స్వామి రెడ్డి, గ్రామస్థులు సంద బాలయ్య, అల్లూరి తదితరులు పాల్గొన్నారు.