అక్షరటుడే, ఇందూరు: పీఆర్‌టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో నగరంలోని రాంమందిర్ పాఠశాలలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా శనివారం నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ మాట్లాడుతూ.. పెన్షన్ ఉద్యోగుల హక్కు అన్నారు. పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్, నాయకులు నాగేశ్వరావు, సాగర్, రమేష్ బాబు, సందీప్, రమేష్, సావిత్రి, జ్యోత్స్న, అపర్ణ, సవిత, సుచిత్ర పాల్గొన్నారు.