అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నగరంలో శంకర్ భవన్ పాఠశాలలో శుక్రవారం విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ మాట్లాడుతూ 2003 నుంచి నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రద్దు చేశాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో సీసీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కావున వెంటనే సీపీఎస్ ను రద్దుచేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేశం, లింబయ్య, గోపి దామోదర్, రాములు, గంగాధర్, శ్రీహరిరావు, రజిని, స్వర్ణలత, రాజేంద్రప్రసాద్, రాజయ్య, శ్రీనివాసరాజు, మాధవి, శ్రీలక్ష్మి, గంగాకిషన్, శాంతాబాయి, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.