అక్షరటుడే, కామారెడ్డి: POCSO case : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు goverment schools పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విలువలు నేర్పాల్సిన వారే దారి తప్పుతున్నారు. చివరకు జైలు పాలవుతున్నారు.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి kamareddy district ramareddy మండలంలోని ఓ గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులపై పొక్సో కేసు నమోదైంది.
తమను టీచర్లు వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థినులు నేరుగా షీ టీంకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసి, రెండు రోజుల క్రితమే రిమాండుకు తరలించినట్టుగా సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత శనివారం ఇదే మండలంలోని ఓ పీఈటీపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించిన విషయం గోప్యంగా ఉంచారు. ఆ ఘటన మరువక ముందే మరోటి వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.