అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad DIEO | విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనే లక్ష్యంగా నిబద్ధతతో పనిచేయాలని నూతనంగా విధుల్లో చేరిన అధ్యాపకులను newly-appointed lacturers ఉద్దేశించి డీఐఈవో DIEO రవి కుమార్ అన్నారు.
ఖిల్లా బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ అధ్యాపకుల Government lecturers జిల్లా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా విద్యాబోధన చేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి చంద్రవిఠల్, ప్రిన్సిపాల్‌లు కాలింగ్ పాషా, శ్రీనాథ్, రజియుద్దిన్ అస్లాం, గంగాధర్, ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నాయకులు ఉన్నారు.