Champions Trophy | చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ముచ్చ‌ట‌గా మూడో సారి ట్రోఫీ ద‌క్కించుకున్న భార‌త్
Champions Trophy | చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ముచ్చ‌ట‌గా మూడో సారి ట్రోఫీ ద‌క్కించుకున్న భార‌త్
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎవ‌రు ట్రోఫీ అందుకుంటారు అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. అయితే చివ‌రికి టీమిండియా అద్భుతమైన విజ‌యం సాధించింది. గ‌తంలో న్యూజిలాండ్ చేతిలో ప‌లు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా ఈ సారి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో మాత్రం న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడించింది. ఏకంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్‌, రోహిత్‌శర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఔట్‌ అవడంతో కష్టాల్లో చిక్కుకున్న‌ట్టు అనిపించిన చివ‌రికి విజ‌యం భార‌త్‌కి ద‌క్కింది.

న్యూజిలాండ్‌ బౌలర్లు ఆచితూచీ పొదుపుగా పరుగులు ఇస్తుండటంతో టీమ్ ఇండియా వెన‌క‌బ‌డ్డ‌ట్టు క‌నిపించింది. రోహిత్‌ శర్మ ఔటైన తర్వాత అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్‌ పెంచేందుకు ప్రయత్నిస్తున్న శ్రేయాస్‌ అయ్యర్‌.. మిచెల్‌ శాంత్నర్‌ బౌలింగ్‌లో రచిన్‌ రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అప్పటికి శ్రేయాస్ అయ్యర్‌ 48 పరుగులు (రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు) చేశాడు. ఆ వెంటనే అక్షర్‌ పటేల్‌ రూపంలో టీమ్‌ ఇండియా మరో వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో ఓ రూర్కేకు క్యాచ్‌ ఇచ్చి 29 పరుగుల వద్ద అక్షర్‌ పటేల్‌ అవుటయ్యాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Glenn Maxwell : ఏంటి.. మ్యాక్స్‌వెల్ ఫిక్సింగ్ చేశాడా.. పాక్ మీడియా విచిత్ర వాద‌న‌

చివ‌ర్లో జ‌డేజా(9), కేఎల్ రాహుల్ (34) ప‌రుగులు చేసి టీమిండియా విజ‌యానికి బాట‌లు వేశారు. అయితే ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ గెలుస్తుంద‌ని ముందు నుండి అంచ‌నాలు ఉన్నా కూడా కొంత డౌట్ ఉండేది. కాని అంద‌రు కూడా స‌మిష్టిగా ఆడి టీమిండియాకి విజ‌యాన్ని అందించారు. బౌల‌ర్స్, బ్యాట్స్‌మెన్స్ అద్భుత‌మైన ప్ర‌తిభ‌తో భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచింది. రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో టార్గెట్ చేజ్ చేయ‌డం సులువు అయింది.

Advertisement