Champions Trophy | న్యూజిలాండ్ న‌డ్డి విరిచిన స్పిన్న‌ర్స్.. మిచెల్ అర్ధ సెంచ‌రీతో కివీస్ స్కోరు 251/7

Champions Trophy | న్యూజిలాండ్ న‌డ్డి విరిచిన స్పిన్న‌ర్స్.. మిచెల్ అర్ధ సెంచ‌రీతో కివీస్ స్కోరు 251/7
Champions Trophy | న్యూజిలాండ్ న‌డ్డి విరిచిన స్పిన్న‌ర్స్.. మిచెల్ అర్ధ సెంచ‌రీతో కివీస్ స్కోరు 251/7
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ భార‌త్,న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా షాకిచ్చారు. మొయిన్ బ్యాట్స్‌మెన్స్ అంతా పెవీలియ‌న్‌కి క్యూ క‌ట్టారు. యంగ్(15), రచిన్ రవీంద్ర(37), కేన్ విలియమ్సన్(11), టామ్ లాథమ్(14), మిచెల్‌(63), ఫిలిప్స్ (34), ప‌రుగులు చేశారు. చివ‌ర్లో బ్రాస్ వెల్(53 నాటౌట్‌) మెరుపులు మెరిపివ్వ‌డంతో న్యూజిలాండ్ 50 ఓవ‌ర్ల‌కి గాను 7 వికెట్లు కోల్పోయి 251 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్స్​లో కుల్దీప్ 2, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 2, జ‌డేజా ఒక‌టి, ష‌మీ ఒక వికెట్ తీశారు. భార‌త్ గెల‌వాలంటే 50 ఓవ‌ర్ల‌కి గాను 252 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది.

Champions Trophy | పెద్ద టార్గెటే..

క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా 15 మ్యాచ్‌ల్లో టాస్ ఓడ‌డం విశేషం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ మ‌రోసారి టాస్ ఓడిపోవ‌డంతో భార‌త్ ఖాతాలో చెత్త రికార్డ్ చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లోనే వరుసగా 15 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన తొలి జట్టుగానూ టీమిండియా నిలిచింది. టీమిండియా తర్వాత నెదర్లాండ్స్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. నెదర్లాండ్స్ జట్టు 2011-2014 మధ్య వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడింది. ఈ 15 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 12 సార్లు టాస్ ఓడగా.. మూడు సార్లు కేఎల్ రాహుల్ టాస్ గెలవలేదు.

ఇది కూడా చ‌ద‌వండి :  Toss | టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​ జట్టు

ఈ మ్యాచ్​లో భార‌త్ మ‌రోసారి చెత్త ఫీల్డింగ్ చేసింది. పేసర్లను అలవోకగా ఆడుతుండడంతో రోహిత్ శర్మ.. పవర్ ప్లేలోనే వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించాడు. రచిన్ రవీంద్ర ఇచ్చిన రెండు క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. రిటర్న్ క్యాచ్‌ను మహమ్మద్ షమీ నేలపాలు చేయగా.. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ ఓ క్యాచ్ వదిలేసాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా ఓ క్యాచ్ జార‌విడిచాడు. అయితే వీరింద‌రిలో ఎవ‌రు కూడా వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకోలేదు. లేదంటే భార‌త్ త‌గిన మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చేది.

Advertisement