IND vs NZ | నేడు టీంఇండియా – కివీస్‌ పోరు

Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs NZ నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కొన‌సాగ‌నుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. గ్రూప్-ఏ చివరి మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ టాపర్, సెమీస్ ప్రత్యర్థులను నిర్ణ‌యించ‌నున్నారు. కివీస్ పై భారత్ ఓడితే సెమీస్ లో సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది.

IND vs NZ : బలాన్ని పరీక్షించుకోవడాకే..  

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఈ రోజు జ‌రిగేది 12వ మ్యాచ్‌. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌బోతోంది. ఛాంపియన్స్ మార్చి 4, 5 తేదీల్లో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లకు ముందు వారి బలాన్ని పరీక్షించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం కానుంది.

IND vs NZ : జట్టు కూర్పు విషయానికొస్తే..

ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఎండీ షమీ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11లో ఉంచుతారని భావిస్తున్నారు. దీనికి తోడు శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు మరింత మంది కొత్త ఆటగాళ్లతో ప్రయత్నించాలని భారత్ ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. అంటే.. అయ్యర్ స్థానంలో పంత్, అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వంటి మార్పులను మనం చూడవచ్చు.

Advertisement