అక్షరటుడే, ఇందూరు: Kakatiya Olampiyad | నగరంలోని కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో మంగళవారం నిర్వహించిన ‘టెక్ ట్రోనికా రోబో ఎక్స్పో’‘Techtronica Robot Expo’ ఆకట్టుకుంది.
కాకతీయ ఒలంపియాడ్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని డీఈవో అశోక్(DEO Ashok) ప్రారంభించారు. అనంతరం పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి ఆధునిక పరిజ్ఞానం ఎంతో అవసరమమన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందన్నారు. టెక్నాలజీ (technology)ని వినియోగించి దేశానికి అవసరమయ్యే ప్రయోగాలను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు తమ అనుభవాన్ని జోడించి విద్యార్థులకు ఆసరాగా నిలవాలని సూచించారు. కేవలం అభ్యసన మాత్రమే కాకుండా టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని వివరించారు. ఫోన్(phones)లను దూరం పెట్టి ప్రయోగాల వైపు అడుగులు వేయాలని తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు రజినీకాంత్, తేజస్విని, రామోజీ రావు, రాజా తదితరులు పాల్గొన్నారు.
Kakatiya Olampiyad | ప్రాజెక్ట్ పేరు: రాకెట్ లాంచర్

విద్యార్థుల పేర్లు: శ్రీముఖి, సనా, నిహారిక, గౌరి
పనితీరు: చంద్రయాన్ స్ఫూర్తితో తయారు చేశాం. రాకెట్ లాంచర్‌ను రిమోట్ కంట్రోల్(remote control) సాయంతో ఆపరేట్ చేయవచ్చు. దీపావళి సమయంలో రాకెట్ ను దూరంగా నిలబడి రిమోట్‌తో కాల్చవచ్చు.
Kakatiya Olampiyad | ప్రాజెక్ట్ పేరు: హార్వెస్ట్ రోబో

విద్యార్థుల పేరు: వర్శిత, సాయి చైత్రిక
పనితీరు : ఇది పండ్లు, కూరగాయల చెట్లను దూరం నుంచి గ్రహిస్తుంది. చెట్టుకి ఎన్ని పండ్లు ఉన్నాయి, అందులో ఎన్ని బాగున్నాయి, ఎన్ని పండ్లుగా మారాయి అని గుర్తిస్తుంది. వివరాలను కంప్యూటర్లో (computer)నిక్షిప్తం చేస్తుంది
Kakatiya Olampiyad | ప్రాజెక్ట్ పేరు: వెల్కమింగ్ రోబోట్

విద్యార్థుల పేర్లు: చైత్ర, హర్షిణి
పనితీరు: సూపర్ మార్కెట్, మాల్స్, ఎయిర్ పోర్ట్‌లో వినియోగించవచ్చు. వచ్చేవారి సంఖ్య లెక్కించడం, అక్కడి వివరాలను చెప్పడం ప్రధాన విధి. రెస్టారెంట్లలో ఫుడ్ సప్లయ్ కూడా చేసేలా రూపొందించారు.