Teenmar Mallanna | కేటీఆర్​తో భేటీ అయిన తీన్మార్​ మల్లన్న.. ఎందుకంటే..

Teenmar Mallanna | కేటీఆర్​తో భేటీ అయిన తీన్మార్​ మల్లన్న.. ఎందుకంటే..
Teenmar Mallanna | కేటీఆర్​తో భేటీ అయిన తీన్మార్​ మల్లన్న.. ఎందుకంటే..
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Teenmar Mallanna | ఎమ్మెల్సీ(MLC Teenmar Mallanna) తీన్మార్​ మల్లన్న సోమవారం అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR)​, హరీశ్​రావు(Harish Rao)తో భేటీ అయ్యారు. బీఆర్​ఎస్ (BRS) ప్రభుత్వ​ హయాంలో కేసీఆర్​ కుటుంబం అంటేనే విరుచుకుపడ్డ మల్లన్న తాజాగా వారిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఆయన వారిని కలిసినట్లు తెలుస్తోంది.

Teenmar Mallanna | ధర్నాకు మద్దతు ఇవ్వాలని..

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్నను అధికార కాంగ్రెస్​ పార్టీ సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇందుకు మద్దతు ఇవ్వాలని బీఆర్​ఎస్​ నేతలను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారితో పాటు బీజేపీ, ఎంఐఎం నేతలను కూడా ఆయన కలిసి, మద్దతు కోరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్​