అక్షరటుడే, బోధన్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను సోమవారం రాత్రి అధికారులు పట్టుకున్నారు. బోధన్ మండలం సిద్దాపూర్ శివారులోని మంజీర నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహశీల్దార్ విఠల్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.