అక్షరటుడే, వెబ్ డెస్క్: బహుజన సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ నాయకత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. అనంతరం వారిరువురు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇందుకు జాతీయ నాయకత్వం ఒప్పుకోకపోగా.. తీవ్రంగా పరిగణించింది. దేశంలో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. అయినప్పటికీ.. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీఎస్పీ అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే నాగర్ కర్నూల్, హైదరాబాద్ టికెట్లను బీఎస్పీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ కేటాయించింది. ప్రవీణ్ కుమార్ సోమవారం అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని సమాచారం.
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా!
Advertisement
Advertisement