అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: సారంగాపూర్‌లోని నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని పున:ప్రారంభించడానికి కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎన్సీఎస్‌ఎఫ్ కర్మాగారాన్ని, యంత్రాలను పరిశీలించి కార్మికులు పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించడానికి ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీఎస్‌ఎఫ్‌ను సైతం పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కలెక్టర్, సంబంధిత అధికారులు కర్మాగార కార్మికులు, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో సమావేశమైనట్లు తెలిపారు.