అక్షరటుడే, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర సర్కారు పలు కార్పొరేషన్లకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులను శనివారం ఉదయం భర్తీ చేసింది. ఇందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి చైర్మన్ పోస్టులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిని సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, బాన్సువాడ నేత కాసుల బాలరాజును అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని 37 నామినేటెడ్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసింది.