‘ధరణి’ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ‘ధరణి’ పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నారు. స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా మండలస్థాయిలో 2-3 కమిటీలు నియమించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరితగతిన బృందాలు దరఖాస్తులను పరిష్కరించేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు భూసంబంధిత సమస్యలకు మార్గం సుగమం కానుంది.