అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. అంతేకాకుండా పుదుచ్చెరి లెఫ్ట్నెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement