Amarnath Yatra | తెలంగాణ అమర్​నాథ్​ యాత్ర.. సలేశ్వరం జాతర

Amarnath Yatra | తెలంగాణ అమర్​నాథ్​ యాత్ర.. సలేశ్వరం జాతర
Amarnath Yatra | తెలంగాణ అమర్​నాథ్​ యాత్ర.. సలేశ్వరం జాతర

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Amarnath Yatra | చుట్టూ పచ్చని అడవి green forests, ఎత్తైన కొండలు, కోనల నడుమ లోయ గుహలో వెలసిన లింగమయ్య(శివుడిని)ను దర్శించుకునే సలేశ్వరం జాతర Saleswaram Jatara రాబోతోంది. చైత్ర పౌర్ణమి Chaitra Pournami వేళ భక్తులు ఎక్కడెక్కడినుంచో తరలిరానున్నారు. కిలోమీటర్ల మేర కాలినడక కొండలు, గుట్టలు దాటుకుంటూ భక్తులు సలేశ్వరం గుడికి చేరుకోనున్నారు. సలేశ్వరం జాతర మూడు రోజుల పాటు సాగనుంది.

Advertisement

ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ, కర్ణాటక AP and Karnataka నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. సలేశ్వరం బయలుదేరిన భక్తులు ‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతాన్ని Nallamala forest area మారుమోగించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు RTC buses, ప్రైవేట్ వెహికల్స్ రాంపూర్ పెంట వరకు భక్తులు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Traffic Jam | సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాపిక్​ జామ్​

సలేశ్వరం క్షేత్రం Saleswaram temple వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో చెంచు పూజారులు పూజలు చేసి, భక్తులకు ఆశీర్వాదం అందిస్తారు.

సలేశ్వరం Saleswaram వెళ్లే భక్తుల కోసం నాగర్​ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు Special buses ఉంటాయి. జాతరకు వచ్చే భక్తులకు ఐటీడీఏ, రెవెన్యూ, ఆర్ డబ్ల్యూఎస్, పోలీస్ శాఖల RWS and Police departments ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు అడవిలో ఎలాంటి మంటలు చెలరేగకుండా ఫారెస్టు ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు. వన్యమృగాల సంచారం ఉండనున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు.

Advertisement