అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పేర్లు మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంపై చర్చించింది. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. హైడ్రాకు విస్తృత అధికారాలపై ఆమోద ముద్ర వేసింది. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. ఒక్కో కార్మికునికి గతేడాది కంటే రూ.20 వేలు అదనంగా ఇవ్వనున్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు సైతం బోనస్ ప్రకటించింది. ఒప్పంద ఉద్యోగులకు రూ.5 వేలు ఇవ్వనుంది.