అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారిని ఏపీ ఐఏఎస్‌లు సృజన, శివశంకర్‌లు కలిశారు. డీవోపీటీ ఆదేశాల మేరకు సీఎస్‌కు వారు జాయినింగ్‌ రిపోర్టు అందజేశారు. తెలంగాణ ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిన తెలంగాణ ఐఏఎస్‌లకు ఇవాళే ఆఖరు తేదీ కావడం గమనార్హం. మరోవైపు తాజాగా తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్‌ అధికారులు రొనాల్డ్‌రోస్‌,అమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌లను రిలీవ్‌ చేసింది. వీరి స్థానంలో ఆరుగురు అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించింది.