అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుట్కా తయారీతో పాటు అమ్మకాలను నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు అన్నిరకాల పాన్ మసాలా, గుట్కా అమ్మకాలు, తయారీపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాస్తవానికి గతంలోనే గుట్కా అమ్మకాలపై ఆంక్షలు విధించారు. పలువురు వ్యాపారులు కోర్టును ఆశ్రయించడంతో అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు ఎత్తేశారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పోలీసుల తనిఖీలు కొనసాగనున్నాయి. జిల్లాకు చెందిన పలువురు గుట్కా వ్యాపారులు పెద్ద మొత్తంలో పాన్ మసాలా తయారు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రమాదకరమైన గుట్కా విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గుట్కా ఫాక్టరీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Silencers Destroy | నో వయలన్స్​.. ఓన్లీ సైలెన్స్​...