అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: హైదరాబాద్ లో హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్ బి కేశవులు డిమాండ్ చేశారు. గురువారం అఖిలపక్షం నాయకులతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలోని పులాంగ్ వాగు, రామర్తి చెరువు శిఖం కబ్జాకు గురైన అధికారులు వారి జోలికి పోకుండా మిగిలిన ప్రాంతంలో ఫెన్సింగ్ వేసి వదిలేశారన్నారు. నాగారం బొందెం చెరువు ఆక్రమణలపై మాత్రం ఆలస్యంగా మేల్కొన్నారని, పెర్కిట్- కొటార్మూర్ గ్రామాల్లోని మైనర్ కాలువ ఆక్రమణలు, బోధన్ చెక్కి చెరువు, భీమ్ గల్ రాథం చెరువు, మొగిలి చెరువు, ధర్మారాయుడి కుంట ఆక్రమణలపైనా ఫిర్యాదులున్నాయని, జిల్లాలోనూ హైడ్రా తరహా చర్యలు తీసుకోవాలని కోరారు. అఖిలపక్షం నాయకులు వెంకట్రాములు, దండి వెంకట్, సుధాకర్, వేమయ్య, అంకం జగదీష్, సామాజిక సేవకులు, ప్రజాసంఘాల నాయకులున్నారు.