Notification | జూనియర్ కళాశాలల రెన్యువల్ కు నోటిఫికేషన్ విడుదల

Notification | జూనియర్ కళాశాలల రెన్యువల్ కు నోటిఫికేషన్ విడుదల
Notification | జూనియర్ కళాశాలల రెన్యువల్ కు నోటిఫికేషన్ విడుదల

అక్షరటుడే, హైదరాబాద్: Notification | రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల రెన్యువల్ junior colleges renueval కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రొవిజనల్ అఫిలియేషన్ పొడిగింపు, అదనపు విభాగాల అనుమతికి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement

Notification | దరఖాస్తు విధానం..

కాలేజీ మేనేజ్మెంట్‌లు tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా 2025 ఏప్రిల్ 5 నుంచి ఆన్‌లైన్‌లో Form-II ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు, ఇన్‌స్పెక్షన్ ఫీజు & అఫిలియేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ (DD), చలానాలు, మాన్యువల్ దరఖాస్తులు స్వీకరించరు.

Notification | ప్రయోజనాలు & నిబంధనలు

గరిష్టంగా 4 మూల విభాగాలు, 5 అదనపు విభాగాలు మాత్రమే అనుమతించబడతాయి. అదనపు విభాగాలకు అవసరమైన భౌతిక వసతులు లేకపోతే ఆ దరఖాస్తులు తిరస్కరిస్తారు.

Notification | ఆవశ్యక ధృవపత్రాలు

ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పకుండా కొన్ని అనుబంధ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి.. (FDR, అద్దె ఒప్పందం, ప్లేగ్రౌండ్ డాక్యుమెంట్, అగ్నిప్రమాద భద్రతా సర్టిఫికేట్, పారిశుద్ధ్య సర్టిఫికేట్, నిర్మాణ ద్రువీకరణ పత్రం) తప్పకుండా అప్లోడ్ చేయాలి. దీంతోపాటు అధ్యాపకుల వివరాలు, అర్హత ధృవపత్రాలు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  KCR CAR | కేసీఆర్​ సరదా షి'కారు'

Notification | ప్రత్యేక నిబంధనలు

అనుమతి లేకుండా కొత్త క్యాంపస్ లను ప్రారంభించరాదు. TGBIE ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి అనుబంధ ప్రైవేట్ జూనియర్ కాలేజీల జాబితా ప్రకటించబడుతుంది.

Notification | మరికొంత ముఖ్య సమాచారం..

కాలేజీ పేరు మార్పు, మేనేజింగ్ సొసైటీ పేరు మార్పు, లొకేషన్ మార్పు (మండల పరిధిలో మాత్రమే), బాయ్స్ నుంచి కో-ఎడ్యుకేషన్/గర్ల్స్ కాలేజీగా మార్పు, లేదా కో-ఎడ్యుకేషన్ నుంచి బాయ్స్/గర్ల్స్ కాలేజీగా మార్పు దరఖాస్తుతో పాటు సమర్పించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నోటిఫికేషన్లు స్పష్టం చేసింది.

Notification | చివరి తేదీ..

లేటు ఫీజు లేకుండా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 2025 మే 4గా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. 2025 జూన్ 8 తర్వాత లొకేషన్ మార్పు, పేరు మార్పు, ఇతర అభ్యర్థనలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. కాలేజీ యాజమాన్యాలు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలుపుతూ, ఈ అఫిలియేషన్ సేవకు జీఎస్టీ వర్తిస్తుందని కూడా పేర్కొంది.

Advertisement