అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని కలెక్టరేట్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ ఛైర్మన్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మకరంద్ పాల్గొన్నారు.