అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరించడానికి అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, బాపిరెడ్డి, యాదిరెడ్డి, రాంచందర్ రెడ్డి పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఇదే..
జిల్లా గౌరవాధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ రెడ్డి, అధ్యక్షుడిగా కిషోర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా సత్యనారాయణ, ముఖ్య సలహాదారుగా దిగంబర్ రావు, కన్వీనర్ గా రాజు, ఉపాధ్యక్షులుగా శ్రీశైలం, రమేశ్, ప్రవీణ్, సంయుక్త కార్యదర్శులుగా ప్రవీణ్, సురేష్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కార్తీక్, రాజేశ్వర్ గౌడ్, సభ్యులుగా ప్రసన్నకుమారి, కృష్ణవేణి, హనుమంతరావు ఎన్నికయ్యారు.