అక్షరటుడే, ఆర్మూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్‌రెడ్డి గడ్చిరోలి జిల్లా చిమూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ మండలంలోని కొల్లార, దేవూరి, కర్బడ, మధ్నాపూర్, ధీర్గవ్, పాలస్గాన్, పిపరాడ గ్రామాల్లో బూత్ లెవల్ కార్యకర్తలను కలిసి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు.