అక్షరటుడే, వెబ్ డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయి చర్చించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో గళం వినిపించాలని నిర్ణయించారు.