అక్షరటుడే, జనగామ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్‌ యూనియన్(టీఎస్‌జేయూ) జనగామ జిల్లా అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్ కోరారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన టీఎస్‌జేయూ జిల్లా కార్యవర్గ సభ్యులు సోమవారం జనగామ కలెక్టర్‌‌ రిజ్వాన్‌ బాషాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌ సమస్యలపై కమిటీ సభ్యులు కలెక్టర్‌‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో దాదాపు 200 మంది వరకు వర్కింగ్‌ జర్నలిస్టులు ఉన్నారన్నారు. ప్రెస్​క్లబ్ కోసం స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరారు. అప్పటివరకు కలెక్టరేట్​లోని ఏదైనా ఖాళీగా ఉన్న గదిని ప్రెస్​క్లబ్​కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఎస్‌జేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్, కోశాధికారి కొన్నే ఉపేందర్, గౌరవ సలహాదారు కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్, ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్, కార్తీక్, ఓంకార్, చెల్లోజు నవీన్ చారి, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.